: దీపతో కలిసి పని చేసేందుకు సిద్ధం...ఆమె మా ప్రత్యర్థి కాదు: పన్నీరు సెల్వం వర్గం


ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు జయ దీపతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి మాఫో పాండ్యరాజన్‌ తెలిపారు. చెన్నైలోని పన్నీరు సెల్వం నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ, దివంగత జయలలిత ఆశీర్వాదంతో ఇ.మధుసూదనన్‌ తమ వర్గం నుంచి ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేస్తారని అన్నారు. ప్రస్తుతం పార్టీలో అమ్మ జయలలిత గతంలో బహిష్కరించిన వారిని తిరిగి చేర్చుకున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు దీనిపై ఆగ్రహంగా ఉన్నారని ఆయన చెప్పారు. దీపను తాము ప్రత్యర్థిగా చూడడం లేదని, ఆమెను మరింత ఉన్నతంగా చూడాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. తమకు కేవలం డీఎంకే మాత్రమే ప్రత్యర్థి అని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News