: కమెడియన్ కు జంటగా నటించనున్న స్టార్ హీరోయిన్?
దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార ఓ కమెడియన్ తో జతకట్టబోతోందనే వార్త ఆసక్తిని రేకిత్తిస్తోంది. తమిళ హాస్య నటుడు సూరికి జంటగా ఈమె నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు నయన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నయనతార. పెద్ద హీరోల పక్కన చేసేందుకే ఆమెకు కాల్స్ షీట్స్ లేవు. కానీ, ఓ నవ దర్శకుడు నయన్ కు కథ వినిపించడంతో ఆమె ఆ కథ పట్ల పూర్తిగా ఇంప్రెస్ అయిందట. ఆద్యంతం వినోదభరితంగా నడిచే ఈ కథ ఆమెకు బాగా నచ్చిందట. దీంతో, ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.