: పొరపాటున కాల్ చేసిన యువతి చిరునామా కనుక్కొని వెళ్లి అఘాయిత్యం!


తన బంధువులకు ఫోన్ చేయబోయి పొరపాటున మరో వ్యక్తికి కాల్ చేయగా, ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి ఆమె చిరునామా సేకరించి, ఇంటికెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. బెంగళూరులోని కృష్ణరాజపుర ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, ఇక్కడి రామ్మూర్తినగర్ కు చెందిన ఓ మహిళ పొరపాటున రాజేశ్వరీనగర్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది.

ఆమె గొంతుకు ఆకర్షితుడైన రోహిత్, తన బుద్ధి చూపించడం మొదలు పెట్టాడు. అదే నంబరుకు పదే పదే ఫోన్ చేస్తూ, అసభ్యకర మెసేజ్ లు పంపాడు. ఆమె ఎన్నిసార్లు హెచ్చరించినా మారలేదు. మొబైల్ నంబర్ ఆధారంగా, ఆమె చిరునామా కనుక్కొని వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేస్తూ, ప్రతిఘటించడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, గత రాత్రి నిందితుడు రోహిత్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News