: జర్నలిస్టులపై దాడి ఘటన.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు శంకర్


సినిమా షూటింగ్ విశేషాలను కవర్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు ఫొటో జర్నలిస్టులపై ‘రోబో 2.0‘ చిత్ర యూనిట్ బౌన్సర్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులపై సదరు జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, చిత్ర దర్శకుడు శంకర్ స్పందించారు. బాధిత జర్నలిస్టులకు ఆయన క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. కాగా, ‘రోబో 2.0’ చిత్రం షూటింగ్ నిమిత్తం చెన్నైలోని ట్రిప్లికేన్ పరిసర ప్రాంతాల్లో సెట్ వేశారు. అక్కడికి వెళ్లిన ఇద్దరు ఫొటో జర్నలిస్టులు సెట్ కు సంబంధించిన ఫొటోలు తీయడంతో బౌన్సర్లు దాడి చేసినట్టు ఓ న్యూస్ ఛానెల్ తెలిపింది.

  • Loading...

More Telugu News