: వైద్యుడిని ఆసుపత్రిపాలు చేసిన స్నేహితుడి అభిమానం!


బాల్యం, కాలేజీ స్నేహాలు మరపురానివి. విడిపోయినా వారితో గడిపిన అనుభూతులు జీవితాంతం వెంటాడుతుంటాయి. సుదీర్ఘ విరామం తరువాత ప్రాణమిత్రులను కలిస్తే...ఆ భావం వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటి అనుభవం ఒక వైద్యుడిపాలిట శాపంగా మారి ఆసుపత్రి పాలు చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...ముంబైకి చెందిన మధుకర్‌ గైక్వాడ్‌ సెయింట్‌ జార్జ్‌ హాస్పిటల్‌ లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మధుకర్ 1990లో ఔరంగాబాద్ లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు అతని క్లోజ్ ఫ్రెండ్ గా అమిత్ బడ్వే ఉండేవాడు. ఆ తరువాత వారిద్దరూ కలుసుకోలేదు. ఈ క్రమంలో ముంబై వచ్చిన అమిత్ స్నేహితుడ్ని కలిసేందుకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.

మధుకర్‌ హాస్పిటల్‌ లో తన క్యాబిన్ లో ఉండగా వెళ్లాడు. అమిత్ ను చూసిన మధుకర్‌ ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపు...అమిత్‌ గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే అతని పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఆనందం స్థానంలో బాధ నిండిపోయింది. దీంతో ఆసుపత్రిలోనే ఉండడంతో అక్కడే చికిత్స చేశారు. దీనిపై మధుకర్‌ మాట్లాడుతూ, లక్కీగా హాస్పిటల్‌లోనే ఉన్నా కాబట్టి సమయానికి వైద్యం అందిందని చెప్పాడు. సీటు నుంచి లేవకముందే అమిత్‌ కౌగిలించుకోవడంతో బరువంతా తన ఛాతీపై పడిందని, దీంతో పక్కటెముకలు విరిగాయని అన్నాడు. దీనిపై అమిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్నేహితుడ్ని మనసారా కౌగిలించుకోవాలనుకుంటే ఇలా జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మధుకర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News