: అమరావతిలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ రోజు లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ తోట నర్సింహం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇస్తూ అమరావతిలో నూతన భవనాల నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు సిద్ధంగా ఉందని తెలిపారు. తాను ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు.