: స్పీకర్, సీఎం అంటే ప్రతిపక్ష సభ్యులకు గౌరవం లేదు: చంద్రబాబు ఆగ్రహం
వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో మళ్లీ గందరగోళం చెలరేగింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు మరోసారి దూసుకెళ్లారు. వారి నిరసనల మధ్యే చంద్రబాబు ప్రసంగించారు. జలదినోత్సవంపై ఆయన ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, సీఎం అంటే విపక్ష సభ్యులకు గౌరవం లేదని ఆయన అన్నారు. పదే పదే సభను అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. వెల్ వద్దకు దూసుకొచ్చి వైసీపీ ఆందోళన తెలుపుతుండడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు.