: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీదే!
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై వైసీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి 14,146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించగా పశ్చిమ రాయలసీమను వైసీపీ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.