: హలో బ్యూటిఫుల్ ధర్మశాల...మేమొచ్చేశాం!: బీసీసీఐ


టీమిండియా చివరి టెస్టు కోసం హిమాచల్‌ ప్రదేశ్‌ లోని ధర్మశాలకు చేరుకుంది. బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు ధర్మశాల ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో హిల్ స్టేషన్ గా పేరొందిన ధర్మశాలకు టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచ్, సిబ్బంది, సహాయ సిబ్బందితోపాటు పలువురు ఆటగాళ్ల భార్యలు కూడా విమానంలో ధర్మశాలలోని కాంగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి పోటెత్తారు. ఆటగాళ్లకు సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు బీసీసీఐ ఒక వీడియోను సోషల్‌ మీడియా ద్వారా ‘హలో బ్యూటిఫుల్‌ ధర్మశాల... మేమంతా వచ్చేశాం’ అంటూ అభిమానులతో పంచుకుంది.


  • Loading...

More Telugu News