: రాడార్ లో పక్షి... హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్


పక్షిని రక్షించేందుకు హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేసిన ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. ఇండియన్ నేవీ సిబ్బంది తీరప్రాంత గస్తీ కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ గాల్లోకి లేచిన అనంతరం...రాడార్‌ లో పక్షి ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే ఎయిర్ కంట్రోల్‌ ట్రాఫిక్ కార్యాలయానికి సమాచారమందించారు. వారి అనుమతితో హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగలేదని, పక్షిని తప్పించేందుకు ల్యాండ్ చేశామని, హెలికాప్టర్ లో సిబ్బంది అంతా క్షేమమని అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News