: 40 అడుగుల పై నుంచి సముద్రంలో పడినా.. ప్రాణాలతో బయటపడిన గోవు
లండన్‌లోని కార్నివాల్ ప్రాంతంలో ఓ గోవు 40 అడుగులపై నుంచి సముద్రంలో పడి, ప్రాణాలతో బయటపడి వార్తల్లో నిలిచింది. ఆ గోవు గర్భంతో ఉండడం మరో విశేషం. పోల్జియత్ వద్ద పర్వత ప్రాంతంలో మేత మేస్తూ ఉన్న ఒక ఆవు ఒక్కసారిగా పై నుంచి సముద్రంలోకి పడిపోయింది. సముద్రంలో ఈదుకుంటూ ఎలాగోలా ఓ ద్వీపానికి చేరుకుంది. అయితే, ఆ ఆవుచుట్టూ ఎత్తైన కొండలే ఉండడంతో అక్కడే ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన ఓ కోస్ట్‌గార్డ్ సిబ్బంది జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. నిన్న ఈ ఆవును బయటకు తీసేందుకు ప్రయత్నించిన సిబ్బంది సుమారు 9 గంటల పాటు శ్రమించి దాన్ని కొండ పైకి తీసుకొచ్చారు. ఆ ఆవుకు చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం. దాన్ని బయటకు లాగాక ఎప్పటిలాగే పచ్చిక మేస్తోంది.