: బంగారు వస్తువులు, ఆయుధాలతో చైనాలో బయటపడిన 300 ఏళ్ల నాటి భారీ నిధి
సుమారు 300 సంవత్సరాల క్రితం చైనాలోని సిచువాన్ ప్రాంతాన్ని పాలించిన రాజు ఝాంగ్ జియాంఝాంగ్... మింగ్ సైన్యానికి భయపడి తరలించిన భారీ సంపద ఇంతకాలానికి వెలుగులోకి వచ్చింది. దాదాపు 1000 పడవల్లో సంపదను తరలిస్తున్న వేళ, జిన్ జియాంగ్ నదీ గర్భంలో పలు పడవలు మునిగిపోగా, ఆ సంపదను ఇంత కాలానికి గుర్తించామని సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ అర్కియాలజీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ వెల్లడించారు. వీటిల్లో 10 వేలకు పైగా బంగారం, వెండి వస్తువులు, ఎన్నో ఆయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వేసవి రావడంతో నదీ పరిసరాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభించగా, ఈ నిధి వెలుగులోకి వచ్చిందని అన్నారు.