: పొగతాగడం మానకుంటే తండ్రి కావడం కష్టమే!

మీకు సిగరెట్ తాగే అలవాటుందా...? యువకులా...? అయితే, మీకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది. అదేంటీ అనుకుంటున్నారా...? సిగరెట్ తాగే అలవాటున్న వారు తండ్రి కావడం కష్టమేనంటున్నారు పరిశోధకులు. సంతాన భాగ్యం కావాలంటూ చికిత్సల కోసం ఆశ్రయించే వారిలో పొగరాయుళ్లు తగిన స్థాయిలోనే ఉంటున్నట్టు అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ కేంద్రం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఎందుకంటే నికోటిన్ వీర్య కణాల ఉత్పత్తిని దెబ్బతీస్తుందని తేలింది. అలాగే, మహిళల్లో ఈ అలవాటు ఉంటే అండోత్పత్తికి విఘాతం కలుగుతుందట. పెళ్లికి ముందు తెలిసో, తెలియకో ఈ అలవాటున్నా... పెళ్లయిన తర్వాత అయినా దీన్ని మానుకుని ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోకుంటే సంతాన భాగ్యం లభించడం కష్టమేనంటున్నారు పరిశోధకులు. 

More Telugu News