: తూర్పు రాయలసీమలో టీడీపీ అభ్యర్థిపై పీడీఎఫ్ అభ్యర్థి విజయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ ఫలితం వెలువడింది. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలను తూర్పు రాయలసీమగా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిపై రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 3545 ఓట్ల తేడాతో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 17, 652 ఓట్లు పోలవ్వగా, 537 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 3,545 ఓట్ల తేడాతో టీచర్స్ యూనియన్ పీడీఎఫ్ (పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్) అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. మరికొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.