: సెక్యూరిటీ గార్డు చేతిలో కర్రలాక్కుని ఈవ్ టీజర్ల తాట ఒలిచిన యువతి!
ఈవ్ టీజర్లకు ఏమాత్రం భయపడకుండా, వాళ్ల తాట ఒలిచి బీహార్ యువతులకు మార్గదర్శకంగా నిలించిందో అమ్మాయి. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. లక్నోలో స్కూటర్ పై ఓ యువతి వెళుతుండగా బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువతి కొంచెం దూరం వెళ్లిన తరువాత తన స్కూటీని ఆపేసి, ఆ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలోని కర్ర లాక్కుని సివంగిలా వారి మీదికి దూకింది. ఇద్దర్నీ చితక్కొట్టింది. ఆమె కొడుతున్న తీరు చూసి, ఆమెను ఆపేందుకు ఎవరూ సాహసించలేదంటే.. ఆమె ఉగ్రరూపం ఏ విధంగా వుందో ఊహించుకోవచ్చు. అనంతరం మహిళా పోలీసుల హెల్ప్ లైన్ నంబర్ 1090కు ఫోన్ చేసి వారిని పట్టించింది.