: రూ.18 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న వ్యాపారవేత్త!


కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.18 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. కేరళ ఆర్టీఏ అధికారుల సమాచారం ప్రకారం, ‘కెఎల్ 01 సిబి 1’ ఫ్యాన్సీ నెంబర్ కోసం ఈ రోజు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో తిరువనంతపురానికి చెందిన ఫార్మసీ యజమాని కేఎస్ బాలగోపాల్ కూడా పాల్గొన్నారు. కోటి రూపాయలు ఖరీదు చేసే తన కొత్త టయోటా ల్యాండ్ క్రూజ్ కోసం రూ.18 లక్షలు చెల్లించి ఈ నెంబర్ ను ఆయన దక్కించుకున్నట్లు చెప్పారు. ఈ వేలం పాట ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే నిమిత్తం ఇందుకు సంబంధించి వీడియో రికార్డు చేశామని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News