: బీసీసీఐలో ముంబై ఓటు ఇక ఉండదు.. ఓటు పరిధిలోకి ఇక ఈశాన్య రాష్ట్రాలు


జస్టిస్‌ లోధా కమిటీ కీలక సిఫార్సు చేసిన విధంగా ‘ఒక రాష్ట్రం–ఒక ఓటు’ను అమలు చేసే క్రమంలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) సన్నాహాలు చేసుకుంటుండడంతో బీసీసీఐలో శాశ్వత ఓటు హక్కును ముంబై సంఘం కోల్పోయింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలు మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయా, సిక్కిం రాష్ట్రాలు ఇప్పుడు కొత్తగా బీసీసీఐ ఓటు పరిధిలోకి చేరాయి. అంతేగాక తెలంగాణ (హెచ్‌సీఏ), ఉత్తరాఖండ్‌ సంఘాలు కూడా శాశ్వత సభ్యులుగా పూర్తిస్థాయి హోదాను పొందాయి.

కాగా, 41 సార్లు రంజీ చాంపియన్లను తయారు చేసిన ముంబై క్రికెట్‌ సంఘం ఇక బీసీసీఐ అనుబంధ సభ్య సంఘంగా ఉండ‌నుండ‌గా, మ‌రోవైపు బరోడా, సౌరాష్ట్ర సంఘాలు కూడా వారి మాతృ సంఘానికి జతగా, బీసీసీఐకి అనుబంధంగా ఉండ‌నున్నాయి. ఇక ఈ సంఘాల‌న్నీ త‌మ ఓటును వినియోగించుకోనున్నాయి.

  • Loading...

More Telugu News