: మద్యం ఇవ్వడం లేదని వైన్ షాపు ఉద్యోగులను లాఠీలతో చితక్కొట్టిన పోలీసులు!
మద్యం షాపు ముందు ఎవరైనా కొట్టుకుంటుంటే ఆపాల్సిన పోలీసులే ఆ దుకాణం ముందు బీభత్సం సృష్టించిన ఘటన కర్ణాటకలోని బెల్గామ్ లో చోటుచేసుకుంది. వైన్ షాపులోకి వచ్చిన పోలీసులు ఆ దుకాణంలో మందు తీసుకోబోయారు. అయితే, తాము అడిగిన మందు ఇవ్వలేదన్న ఆగ్రహంతో అందులో పనిచేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. తమ లాఠీలను వారిపై ప్రయోగించారు. తమ యజమాని వచ్చిన తరువాత మీకు కావాల్సిన మద్యాన్ని ఆయనను అడిగి తీసుకెళ్లాలని అందులో పని చేసేవారు పోలీసులకు చెప్పినప్పటికీ, వినిపించుకోకుండా చితక్కొట్టారు. అనంతరం సిబ్బంది కేసుల కొద్దీ మద్యాన్ని తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.