: ఏపీ అసెంబ్లీలో గందరగోళం... చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీ నేతలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో ఎన్నో లోపాలున్నాయని ఆరోపిస్తూ, 'వీ వాంట్ జస్టిస్' అంటూ వైసీపీ నేతలు పోడియం వద్ద నినాదాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా కలగజేసుకున్న చంద్రబాబు మాట్లాడుతూ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తీరు మంచిది కాదని అన్నారు. గందరగోళం మధ్యే ఆయన పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రజలు బాగుపడతారని, ఆ తర్వాత వైసీపీకి పుట్టగతులు ఉండవనే భయంతోనే వారు ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.