: నిజామాబాద్ మాజీ ఎంపీ కేశిపల్లి గంగారెడ్డి మృతి
నిజామాబాద్ మాజీ ఎంపీ కేశిపల్లి గంగారెడ్డి (90) ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయన మూడు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో గంగారెడ్డి ఎంతో కృషి చేశారని తెలిపారు. గంగారెడ్డి మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.
గంగారెడ్డి టీడీపీ తరపున 1991 (పదవ లోక్‌సభ) ఎన్నికల్లో మొదటి సారి ఎంపీగా గెలిచారు. అనంతరం అదే పార్టీ తరఫున పోటీ చేసి 12వ లోక్‌సభకు, చివరిసారిగా 1999-2014 లో పదమూడవ లోక్ సభకు ఎన్నికయ్యారు.