: ‘మన అందరి కాటమరాయుడు’ అంటున్న హీరో రామ్ చరణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిన్న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ పై మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్ తన ఫేస్ బుక్ వేదికగా స్పందించాడు. ‘ఈ చిత్రం ట్రైలర్ పవర్ ప్యాక్డ్ సెలబ్రేషన్ లా కనిపిస్తోంది. మన అందరి కాటమరాయుడు మార్చి 24 నుంచి థియేటర్లలో..’ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.