: దేవదేవుని దివ్య వైభవం... మరో ఎనిమిది రోజుల్లో నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో!


ఈ నెల 27వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే రెండో అతిపెద్ద, హిందువులకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న తిరుమల శ్రీవెంకటేశ్వరునిపై నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ తీసిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. భద్రతా కారణాల రీత్యా ఇంతవరకూ టీటీడీ ఉద్యోగులు మినహా మరెవరినీ ఆలయం లోపలికి, లడ్డూలు తయారు చేసే పోటులోకి వీడియో కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రవేశించేందుకు అధికారులు అంగీకరించని సంగతి తెలిసిందే. ఇక ఎన్జీసీ చానల్, ఉచిత భోజనాలపై డాక్యుమెంటరీని తయారు చేస్తూ, తిరుమలకు వచ్చి, ఆపై దేవదేవుని వైభవాన్ని చూసి ప్రత్యేక కార్యక్రమాన్నే షూట్ చేసిన సంగతి తెలిసిందే. తిరుమల వైభవం జగద్వితం అవుతుందన్న ఆలోచనతో టీటీడీ సైతం ఎన్జీసీకి అనుమతులు ఇచ్చి, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం ప్రోమో సైతం ఎంతో ఆకర్షిస్తుండటం గమనార్హం. ఎన్టీసీ ప్రోమో వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News