: యూపీలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఎందుకంటే..!: వెంకయ్యనాయుడు వివరణ


యూపీ సీఎంగా గోరఖ్ పూర్ మఠాధిపతి యోగి ఆదిత్య నాథ్ ను ఎంచుకున్న బీజేపీ అధిష్ఠానం, ఆయన నియామకంతో పాటే మరో ఇద్దరు ముఖ్య నేతలైన కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ విధివిధానాల మేరకే ఆదిత్యకు పగ్గాలు అప్పగించామని వెల్లడించిన వెంకయ్యనాయుడు, పాలనలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించినట్టు తెలిపారు. ఈ కోరిక ఎమ్మెల్యేల నుంచే వచ్చిందని, ఆపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కాగా, ఆదిత్యనాథ్ దుందుడుకు తనం, వివాదాస్పద వైఖరి కారణంగానే ఇద్దరు డిప్యూటీలను నియమించినట్టు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. నేడు ప్రమాణ స్వీకారం జరగనుండగా, ఏపీ సీఎం చంద్రబాబు, నాగాలాండ్, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల సీఎంలు సహా పలువురు జాతీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News