: పవన్ కల్యాణ్ ఎంట్రీ... దద్దరిల్లిన శిల్పకళావేదిక ఆడిటోరియం!
కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని శిల్పకళావేదికలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుక సాయంత్రం ఆరు గంటలకే ప్రారంభమైనప్పటికీ పవన్ కల్యాణ్ 8:57 నిమిషాలకు ఎంటరయ్యారు. పవన్ కల్యాణ్ శిల్పకళావేదిక ఆడిటోరియం లోపలికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ప్రవేశించడంతో అంతవరకు ఎంటర్ టైన్ మెంట్ తో సేదదీరిన అభిమానులకు పూనకం వచ్చింది. సుమారు ఐదు నిమిషాల సేపు ఆడిటోరియం పవన్ కల్యాణ్ నినాదాలతో దద్దరిల్లింది. పవన్ కల్యాణ్ తో పాటు టీవీ9 అధినేత రవి ప్రకాశ్, Ntv అధినేత నరేంద్ర చౌదరి కూడా పాల్గొనడం విశేషం.