: 'ఓకే జాను'లోని ఆ పాటకు యూ ట్యూబ్ లో 15 కోట్ల క్లిక్స్!


'ఓకే జాను' సినిమాలోని హమ్మ హమ్మ పాట‌ యూ ట్యూబ్ దుమ్ము దులిపేస్తోంది. బాక్సాఫీసు వద్ద సినిమాకు వ‌చ్చిన ఆద‌ర‌ణ‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా దూసుకుపోతోంది. సినిమా ప్ర‌చారంలో భాగంగా ఆ చిత్ర బృందం మూడు నెలలకు ముందు ఈ రిమిక్స్ పాట‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పాట యూ ట్యూబ్‌లో 15 కోట్ల 33 లక్షల వ్యూస్‌ను సాధించింది. ఈ సంద‌ర్భంగా సోని మ్యూజిక్ ఇండియా సంస్థ తమ ట్విట్ట‌ర్ ఖాతాలో హ‌ర్షం వ్య‌క్తం చేసింది. దిగ్గ‌జ‌ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహమాన్ అందించిన హమ్మ హమ్మ పాటను ఓకే జాను సినిమా కోసం రిమిక్స్ చేశారు.

ఈ పాట‌లో శ్ర‌ద్ధాకపూర్ అందాలకు రెహ‌మాన్ మ్యూజిక్ తోడ‌వడంతో ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు యూట్యూబ్‌లో బేఫికర్ లోని ‘నషే సి చద్’ 20 కోట్ల 11 ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో తొలిస్థానంలో ఉంది. ఈ వీడియో సాంగ్‌ను గ‌త ఏడాది అక్టోబ‌ర్ 18న ఉంచారు. ఆ త‌రువాత‌ బార్ బార్ దేఖో సినిమాలోని 'కాలా చెష్మా' 20 కోట్ల 2 లక్షల వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. ఆ త‌రువాతి స్థానంలో హమ్మ హమ్మ సాంగ్ నిలిచింది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/1tVL11ULjYY" frameborder="0" allowfullscreen></iframe>

  • Loading...

More Telugu News