: కృష్ణా జలాల వివాదాలను విచారిస్తున్న 'బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్' రద్దు?
అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు - 2017ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే కృష్ణా నదీ జలాల వివాదాలను విచారిస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఏపీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కొనసాగుతున్న కృష్ణా వివాదాలపై విచారణ కేంద్రం తెచ్చే కొత్త ట్రైబ్యునల్ కు బదిలీ అవుతుంది.
వాస్తవానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సహా దేశంలో ఎనిమిది ట్రైబ్యునళ్లు అంతర్ రాష్ట్ర జల వివాదాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నాయి. అయినా, ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో, ఈ ట్రైబ్యునళ్లను రద్దు చేసి, కొత్తగా శాశ్వత ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.