: ప్రధాని సోషల్ మీడియా ఖర్చెంతో తెలుసా?


సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోదీ ఎంత చురుగ్గా, వేగంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రజలతో అనుసంధానం కోసం ప్రధాని పలు సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ కోసం పైసా కూడా ఖర్చు కావడం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. మోదీ ప్రధాని  పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి నిర్వహణ కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది. నరేంద్రమోదీ యాప్‌ను ఎంవైజీవోవీ, గూగుల్ పోటీలో భాగంగా విద్యార్థులు రూపొందించారని పేర్కొన్న పీఎంవో ప్రైజ్ మనీని గూగుల్ ఇచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్‌ను బీజేపీ ఐటీ విభాగం నిర్వహిస్తోంది. ఆప్‌ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీఎంవో పైవిధంగా సమాధానం ఇచ్చింది.

  • Loading...

More Telugu News