: అక్షయ్ కుమార్ బాటలో సైనా నెహ్వాల్!


ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బాటలో భారత్ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నడిచి, మానవతా హృదయాన్ని చాటుకుంది. 27వ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంలో సైనా చేసిన ప్రకటన అందర్నీ ఆకట్టుకుంటోంది. దాని వివరాల్లోకి వెళ్తే...చత్తీస్‌ గఢ్‌ లోని సుక్మా జిల్లాలో నక్సల్స్‌ దాడిలో మరణించిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. దీంతో సైనా అందించిన సాయంతో ప్రతి జవాను కుటుంబానికి 50 వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సైనా జవాన్ల త్యాగాలను కీర్తించింది. దేశ ప్రజల రక్షణ కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని పేర్కొంది. వారి త్యాగాలకు ఏం చేసినా తక్కువేనని సైనా పేర్కొంది. 

  • Loading...

More Telugu News