: ఇక అసెంబ్లీలో బడ్జెట్‌పై నేను మాట్లాడను!: జానారెడ్డి
ఉత్తరప్రదేశ్ సహా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ అంటూ పలువురు చేస్తోన్న విమర్శలపై కాంగ్రెస్ తెలంగాణ నేత జానారెడ్డి స్పందిస్తూ వాటిని కొట్టిపారేశారు. రాహుల్ గాంధీ ఐరన్ లెగ్గో కాదో తర్వాత తేలుతుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల గురించి జానారెడ్డి మాట్లాడుతూ.. తాను ఇక అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడబోనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి తప్పుడు లెక్కలే చెబుతోందని అన్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై కూడా తాను మాట్లాడకుండా.. తమ పార్టీ సభ్యులకు అవకాశమిస్తానని ఆయన తెలిపారు.