: ఆయా నగరాల పేర్లను ముద్దులొలుకుతూ పలుకుతున్న ధోనీ కూతురు!


ముద్దులొలుకుతూ మాటలు పలుకుతున్న తన కూతురి వీడియోను టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి త‌న ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సాక్షి ప‌లు నగరాల పేర్లు చెబుతోంటే వాటిని జీవా మళ్లీ ప‌లుకుతోంది. సాక్షి 'ఢిల్లీ' అనగానే, వాళ్ల కూతురు 'దెల్లీ' అని చెబుతోంది. కోల్‌కతాని కోల్‌కట్టా అని, చెన్నైని టెన్నై అని, హైదరాబాద్‌ని హైద్రాబాద్ అని ప‌లుకుతోంది. వ‌చ్చేనెల 5 నుంచి హైద‌రాబాద్‌లో ఐపీఎల్‌-10 ప్రారంభ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల పేర్ల‌నే సాక్షి త‌మ‌ కూతురితో ప‌లికించింది.



Learning things !!

A post shared by Sakshi (@sakshisingh_r) on


  • Loading...

More Telugu News