: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒవైసీ ప్రశంసలు
టీఎస్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకపోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సకాలంలో పడ్డ వర్షాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం పెరిగిందని అన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంపై ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేయడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అయితే, కొంత మంది రైతులు పంటను కోల్పోయారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ ను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని సూచించారు. పాతబస్తీ అభివృద్ధికి రూ. 5వేల కోట్లను ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. గండిపేట నుంచి ఓల్డ్ సిటీకి మంచి నీరు ఇవ్వాలని విన్నవించారు.