: మీ సిద్ధాంతాలు ఇప్పుడు పనికిరావు!: కమ్యూనిస్టులపై మండిపడ్డ కేసీఆర్
కమ్యూనిస్టు నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలు పనికిరావని... చైనా కూడా ఆ సిద్ధాంతాలను పక్కనబెట్టి, అమెరికాతో పోటీపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు తేవడం, వాటిని తీర్చడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయిందని... తాము సక్సెస్ అయ్యామని చెప్పారు. తాను యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు భూపాలపల్లి థర్మల్ ప్లాంట్ కోసం కృషి చేశానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు రూ. 15 నుంచి రూ. 20 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.