: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల రద్దు వార్తతో ఆగిపోయిన తల్లి గుండె!


సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు... సింగరేణి కార్మికుల కుటుంబాల్లో అలజడి రేపుతోంది. తాజాగా మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ లో ఓ ప్రాణాన్ని బలిగొంది. హైకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి సీసీసీ నస్పూర్ లోని నాగార్జున కాలనీకి చెందిన పొసమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది. వారసత్వంగా తన కుమారుడికి ఉద్యోగం రాదేమో అనే ఆవేదనతో ఆ తల్లి గుండె ఆగిపోయింది. మరోవైపు, వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దుపై భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 

  • Loading...

More Telugu News