: కోహ్లీ స్థానంలో రహానె కెప్టెన్సీ .. డ్రస్సింగ్‌ రూమ్‌లోనే కోహ్లీ


రాంచీలో జరుగుతున్న టెస్టు మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడిన విషయం తెలిసిందే. అయితే, ఆయ‌న ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో రెండోరోజు ఆటలో కోహ్లీ క‌న‌ప‌డ‌క‌పోవ‌డం ఆయ‌న అభిమానుల‌ను నిరాశ‌కు గురిచేసింది. అయితే, కోహ్లీ గాయం తీవ్రమైంది కాదని బీసీసీఐ తెలిపింది. మిగతా మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండేందుకు తగిన చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. ఈ రోజు కోహ్లీ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమై అక్క‌డి నుంచి ఆట‌ను చూస్తున్నాడు. ఆయన‌ స్థానంలో రహానె ఈ రోజు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నాడు.


  • Loading...

More Telugu News