: ఈ నెలాఖరు వరకు కరెన్సీ కష్టాలు ఇంతే!
జనాల కరెన్సీ కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. అన్ని బ్యాంకుల ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కొరత మరీ దారుణంగా ఉంది. గత మూడు వారాలుగా ఏటీఎంలు మూత పడ్డాయి. నగదు కోసం జనాలు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. డిపాజిట్ల మొత్తాలు కూడా తగ్గడంతో బ్యాంకుల్లో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. విత్ డ్రాలపై పరిమితి ఎత్తివేయడంతో, బ్యాంకుల నుంచి వినియోగదారులు పెద్ద మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. దీంతో, కరెన్సీ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అధికారులు స్పందిస్తూ, ఈ నెలఖరు వరకు కరెన్సీ కష్టాలు తప్పవని తెలిపారు. మరో వారం రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో నగదు నిల్వలు పెరుగుతాయని చెప్పారు.