: కడపలో ఓటు హక్కును వినియోగించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు


కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో వీరు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తుండగా... టీడీపీ తరపున బీటెక్ రవి బరిలోకి దిగారు. మరోవైపు, ఈ విజయాన్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో... తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News