: నంద్యాల బరిలో భూమా బ్రహ్మానందరెడ్డి?
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన నంద్యాల నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగిరెడ్డి రెండో కుమార్తె పేరు ప్రచారంలో ఉండగా తాజాగా బ్రహ్మానందరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో శోభా నాగిరెడ్డి మృతి సమయంలోనే బ్రహ్మానందరెడ్డి ఆసక్తి కనబరిచారు. అయితే నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియను బరిలోకి దింపారు. దీంతో బ్రహ్మానందరెడ్డి కోరిక కోరికగానే మిగిలిపోయింది.
ఇప్పుడు నంద్యాల సీటు ఖాళీ కావడంతో ఆ స్థానం నుంచి బరిలోకి దిగాలని బ్రహ్మానందరెడ్డి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందిన జగత్ డెయిరీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అల్లుడు అయిన బ్రహ్మానందరెడ్డి ఎన్నికల బరిలోకి దిగితే కాటసాని కూడా మద్దతు ప్రకటిస్తారని సమాచారం.