: టీడీపీ కౌన్సిలర్ కుమారుడిపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు


అనంతపురం జిల్లా ధర్మవరంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కౌన్సిలర్ బావమ్మ కుమారుడు రాళ్లపల్లి బాబు, అతని అనుచరులపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడికి దిగారు. వారి దాడిలో బాబు సహా ఐదుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడితో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో పోలీసులు పెద్ద ఎత్తున గస్తీ నిర్వహిస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రోద్బలంతోనే వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News