: ఈ సమయంలో రాజకీయాల గురించి మాట్లాడటం పద్ధతి కాదు: అఖిల ప్రియ


కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో, నంద్యాల స్థానానికి ఖాళీ ఏర్పడటంతో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే, భూమా నాగిరెడ్డి మృతి చెందిన రోజే, ఆ నియోజకవర్గం నుంచి కచ్చితంగా తమ అభ్యర్థిని పోటీకి నిలబెడతామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ విషయమై ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియను మీడియా ప్రశ్నించగా, తన తండ్రి మృతి చెందిన సమయంలో రాజకీయాల గురించి మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పారు. అయితే, ప్రజల గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే సరైన అభ్యర్థో వారినే ఎన్నుకుంటామని అన్నారు. సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని, ఈ సందర్భంగా నిర్వహించే మీటింగ్ కు తమను పిలుస్తారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలబడే అభ్యర్థి తమ కుటుంబం నుంచి ఉంటారా? ఉండరా? అనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అఖిల ప్రియ చెప్పారు.

  • Loading...

More Telugu News