: ఐసీయూలో చికిత్స పొందుతున్న యూపీ బీజేపీ అధ్యక్షుడు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యది కూడా కీలక పాత్రే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీపీ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన విశ్రాంతి లేకుండా గడిపారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది.