: సెంచరీతో స్మిత్..అర్ధ సెంచరీతో మ్యాక్స్ వెల్...నిలబడ్డ ఆసీస్


రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ నిలదొక్కుకున్నారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరుపై కన్నేసి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందన్న తన అంచనాను నిజం చేస్తూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేసి సత్తాచాటాడు. మరో ఎండ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ అర్ధ సెంచరీతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. వీరిద్దరూ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఓపెనర్ రెన్ షా (42) ఆకట్టుకోగా, వార్నర్ (19), హ్యాండ్స్ కోంబ్ (19) ఫర్వాలేదనిపించారు.

షాన్ మార్స్ (2) పేలవంగా ఆడి అవుటయ్యాడు. కోంబ్ అవుటైన తరువాత వికెట్ పడకుండా స్మిత్, మ్యాక్స్ వెల్ జాగ్రత్తపడ్డారు. దీంతో వీరిద్దరూ దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలో స్మిత్ (109) సెంచరీ చేయగా, మ్యాక్స్ వెల్ (74) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 85 ఓవర్లు ముగిసేసరికి 278 పరుగులు చేసింది. స్మిత్, మ్యాక్స్ వెల్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఉమేష్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా చెరొక వికెట్ తీశారు. కాగా, బౌలర్లు తొలిరోజు ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం. 

  • Loading...

More Telugu News