: ఒక్క రోజులోనే కోటి వ్యూస్ పొందిన బాలీవుడ్ సినిమా!
ఈ నెల 14న బాలీవుడ్ సినిమా ‘బేగమ్ జాన్’ ట్రైలర్ విడుదల అయింది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్ లో కోటి వ్యూస్ దక్కించుకుంది. ఈ స్పందనకు బాలీవుడ్ ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితం బెంగాలీలో వచ్చిన ‘రాజ్ కహిని’ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీజిత్ ఈ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 14న ‘బేగమ్ జాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.