: ఒబామాను అతడు కాల్చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించగలరా? జైలు కెళ్లాల్సిన సమయం వస్తుంది!: గాయకుడు 'స్నూప్‌డాగ్‌'పై ట్రంప్ ఆగ్రహం


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పేరును రొనాల్డ్ క్లంప్‌గా మార్చేసి, ఆయ‌న‌ బొమ్మను తుపాకితో కాల్చిన‌ట్లు చూపిస్తూ ప్ర‌ముఖ గాయకుడు స్నూప్‌డాగ్‌ ఓ వీడియో తీయడం ఆ దేశంలో చ‌ర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్య‌క్షుడి తీరుపై ఆ దేశంలో నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఇలా ఆయనను కాల్చేసిన‌ట్లు చూపించడం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. చివ‌ర‌కు ఈ వీడియోపై డొనాల్డ్‌ ట్రంప్ కూడా స్పందించారు.

‘స్నూప్‌డాగ్‌ కెరీర్‌ పాడైపోయి.. ఆ కోపంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామాను కాల్చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించగలరా? జైలుకెళ్లాల్సిన సమయం ఆసంనమవుతుంది’ అని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. ఆ వీడియోలో అమెరికా పోలీసుల కర్కశత్వం, ఇతర సామాజిక అంశాలను కూడా స్నూప్ డాగ్‌ చూపించాడు. త‌నపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై స్పందించిన స్నూప్ డాగ్ ఈ వీడియోలోని ఆ పాటను వివాదాస్పదం చేయాలనుకోలేదని చెప్పారు. తమ బాధను చెప్పుకోలేని ఆమెరికా వాసుల కోసమే ఇలా చేశానని అన్నారు.


  • Loading...

More Telugu News