: పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అమరీందర్.. సిద్ధూకు కేబినెట్ మంత్రి పదవి
పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఉన్నారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ లో వీరి చేత పంజాబ్ గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు హాజరయ్యారు.
అమరీందర్ సింగ్ కేబినెట్లో మన్ ప్రీత్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, సాధు సింగ్ దరమ్ సోత్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను కైవసం చేసుకోగా, ఆప్ 20, అకాలీదళ్, బీజేపీల కూటమి 15 స్థానాల్లో గెలిచాయి.