: నితిన్ కపూర్ పై తప్పుడు కథనాలు ఆపండి.. సోదరి జయసుధను ఇబ్బంది పెట్టకండి: మోహన్ బాబు విజ్ఞప్తి


ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆర్థిక బాధల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడంటూ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని, దయచేసి ఆ కథనాలను ఆపాలని ప్రముఖ నటుడు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. సోదరి జయసుధతో మాట్లాడినప్పుడు ఆమె ఇదే విషయమై తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు మోహన్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. జయసుధ, ఆమె కొడుకులు ధైర్యంగా ఉండేలా శక్తిని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. మిత్రుడు నితిన్ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని మోహన్ బాబు తన ట్వీట్ లో కోరారు.
 

  • Loading...

More Telugu News