: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. అదనంగా రెండు శాతం డీఏ పెంపు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. కరవు భత్యం (డీఏ) ను అదనంగా రెండు శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, 2017 జనవరి నుంచి డీఏ లేదా డీఆర్ రెండు శాతం పెంపు అమలు కానుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.