: కోహ్లీ చెప్పిన దాంట్లో వాస్తవం లేదు!: ఆసీస్ కెప్టెన్ స్మిత్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు చెప్పాడని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ, డీఆర్ఎస్ వివాదంలో స్మిత్ గురించి తానన్న మాటలకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో డీఆర్ఎస్ నిర్ణయం గురించి తాము డ్రెస్సింగ్ రూంవైపు పలుమార్లు చూశామని కోహ్లీ చెప్పడంలో వాస్తవం లేదని చెప్పాడు.