: కాంగ్రెస్ ను ఆటో ఇమ్యూన్ వ్యాధి పీడిస్తోంది: కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రియా దత్

కాంగ్రెస్‌‌ పార్టీని 'ఆటో ఇమ్యూన్' వ్యాధి పట్టి పీడిస్తోందని ఆ పార్టీ మాజీ ఎంపీ ప్రియాదత్ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాధించిన ఫలితాలు, అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా ఆమె తన అభిప్రాయాలు వెల్లడిస్తూ, కాంగ్రెస్‌ పార్టీని వేరెవరో నాశనం చేయడం లేదని, ఆ పార్టీని ఆ పార్టీయే నాశనం చేసుకుంటోందని అన్నారు. పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించాలన్నా, పార్టీ కేడర్ లో పునరుత్తేజం కలగాలన్నా చికిత్స లోపలి నుంచే జరగాలని స్పష్టం చేశారు.

ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో ఫలితాలకు జవాబుదారీతనం చూపించేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధంగా లేదని, ఇప్పుడిప్పుడే ప్రశ్నించే నేతలు గళమెత్తుతున్నారని ఆమె చెప్పారు. మరో కాంగ్రెస్‌ నేత కేవీ థామస్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నాయకత్వం ఎదగాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి మూడేళ్లు గడిచినా, ఎలాంటి మార్పులు సంభవించలేదని ఆయన చెప్పారు. ప్రియాంకా గాంధీ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగాలని వారు సూచించారు. 

More Telugu News