: ఉదయం తెలుగులో...సాయంత్రం హిందీ, సోషల్ మీడియాలో ట్రైలర్ విడుదల: బాహుబలి యూనిట్


రేపే బాహుబలి కన్ క్లూజన్ ధియేటరికల్ ట్రైలర్ విడుదల కానుందని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రేపు ఉదయం పది గంటలకు తెలుగులోని ట్రైలర్ ను హైదరాబాదులో విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ తెలిపింది. సాయంత్రం 5 గంటలకు హిందీ ట్రైలర్ ను ముంబైలో విడుదల చేయనున్నామని చెప్పింది. సుమారు 2 నిమిషాల 50 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్ ను తెలుగులో 300 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బాహుబలి 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.  

  • Loading...

More Telugu News