: కుప్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్ లోని ఉత్తర్ లాయ్ ఎయిర్ బేస్ సమీపంలోని దేవనియోంకిధాని గ్రామం వద్ద ఈ విమానం క్రాష్ అయింది. ఈ ప్రమాదం నుంచి విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ధూరా రామ్, అతని భార్య, మనవడు ఉన్నారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.